Thursday, December 26, 2024

ప్రియురాలి ఫిర్యాదు… పెళ్లి రద్దు చేసుకున్న వధువు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ప్రియురాలిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు… పెద్దలు కుదుర్చిన యువతితో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ప్రియురాలు ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పెళ్లి కుమారుడిని అరెస్టు చేసిన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోధన్‌పల్లి గ్రామానికి చెందిన సాయి (27) అనే యువకుడు , యువతితో పరిచయం ఏర్పడంతో ప్రేమగా మారింది. సాయి కారు డ్రైవర్ కావడంతో పలుమార్లు కారులో తీసుకెళ్లి ఏకాంతంగా గడిపేవారు. సదరు యువతికి నాలుగు నెలల గర్భవతి కావడంతో గర్భవిచ్ఛితి చేయించడంతో ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.

Also Read: సిఎం కెసిఆర్ చెప్పిన మిడతల దండు కథ

సాయికి కుటుంబ సభ్యులు మరో యువతితో పెళ్లి నిశ్చయం చేయడంతో ప్రియురాలు అతడిని నిలదీసింది. మే 28న ఓ దేవాలయంలో రహస్యంగా ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. రెండు మూడు రోజుల తరువాత తనకు అవసరం లేదని ఆమెను బెదిరించి వెళ్లిపోయాడు. తనని పెళ్లి చేసుకొని మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రియురాలు కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పెళ్లి మండపానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన వరుడు తన రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జరిగిన విషయం వధువు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పెళ్లి రద్దు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News