Saturday, March 29, 2025

డబ్బు కోసం రెండో పెళ్లి.. చివరకు గట్టి షాకే తగిలింది

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం కొందరు తప్పుదోవలో ప్రయత్నాలు చేస్తుంటారు. ఉచితాలు అందుకోవాలని రకరకాల వేషాలు వేస్తుంటారు. అయితే ఇందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు మాత్రం ఫన్నీగా దొరికిపోతారు. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక వివాహాల్లో పాల్గొని నగదు, ఇతర బహుమతులు అందుకొనేందుకు రెండో పెళ్లికి సిద్ధమైంది ఓ మహిళ. దాన్ని అత్తింటి వాళ్లు అడ్డుకున్నారు.

అత్తింటి వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం. అస్మా అనే మహిళకు మూడు సంవత్సరాల క్రితం మహమ్మద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి దీంతో ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన అస్మా రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు నిర్వహిస్తోంది అని తెలుసుకుంది. తన బంధువు జుబేర్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంటే.. యోగి ప్రభుత్వం ఇచ్చే రూ.35 వేల నగదుతో పాటు ఇతర బహుమతులు కూడా కొట్టేయొచ్చు అని ప్లాన్ వేసింది. వచ్చిన డబ్బుతో చెరో గేదెను కొనుక్కోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వాళ్లు ఆ వివాహానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న అస్మా అత్తింటివారు సరిగ్గా పెళ్లి జరుగుతున్న సమయంలో వెళ్లి అడ్డకున్నారు. దీంతో సామూహిక నిబంధనలను ఉల్లఘించినందుకు, అనధికారికంగా లబ్ధి పొందాలని ప్రయత్నించినందుకు పోలీసులు అస్మా, జుబేర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News