Saturday, December 21, 2024

విశాఖలో… విషాదం

- Advertisement -
- Advertisement -

విషం సేవించి నవ వధువు మృతి

Bride commit suicide in marriage

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన కుప్పకూలి మృతి చెందిన ఘటనలో పాయిజన్ ప్రభావం ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి పీటలమీద కుప్పకూలి మృతి చెందిన సృజన మృతదేహానికి టెస్టులు నిర్వహించిన వైద్యులు పోలీసులకు రిపోర్టు అందించారు. ఈ రిపోర్టు మేరకు పిఎం పాలెం సిఐ రవికుమార్ మాట్లాడుతూ నవ వధువు సృజన పాయిజన్ తీసుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని తెలిపారు. అయితే, పాయిజన్ ఎందుకు తీసుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అనంతరం ఈ ఘటనపై విశాఖ నార్త్ ఎసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సృజనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, సృజన గుర్తు తెలియని పాయిజన్ తీసుకొని చనిపోయినట్లు ఇండస్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చిండన్నారుది. పోస్ట్ మార్టం రిపోర్టు నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని, ఆమె బ్యాగులో గన్నేరు కాయల తొక్కు లభించిందని వివరించారు. అయితే గన్నేరు పప్పు ఆమె బ్యాగ్‌లోకి ఎలా వచ్చింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నాము. ఇప్పటికే ఈ కేసు విషయంలో కొంతమందిని విచారించామని, సృజనా మృతిలో వాస్తవాలు తెలియాలంటే ఆమె తల్లిదండ్రులు కూడా వాస్తవాలు చెప్పాలన్నారు. ఈక్రమంలో సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
పెళ్లి పీటలపై:
పెళ్లి సందర్భంగా బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ హఠాన్మరణం పై తొలుత సాధారణంగా భావించినా, మృతి సమాచారం పోలీసులకు ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు విషాహారం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేయడంతో మృతదేహాన్ని కెజిహెచ్ కి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా రెండు రోజులుగా పెళ్లికుమార్తె అలసటకు గురై నీరసించిందని అనుకున్నామని, కానీ ప్రాణం కోల్పోతుందని భావించిలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సృజన బ్యాగ్ లో కూడా గన్నేరు పప్పు ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని సేకరించి పరీక్షకు పంపామని, ఇప్పటివరకు ఎటువంటి ఆత్మహత్య లేఖా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
అనుమానస్పద మృతిగా కేసు ః
పెళ్లి కూతురు సృజన శరీరంలో విషపదార్థం గుర్తించినట్టు వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె మృతికి ఫుడ్ పాయిజన్ కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నివేదికతో పోలీసులు మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు. తల్లిదండ్రుల వాంగ్మూలం రికార్డ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదిలావుండగా హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సృజన పెళ్లి కోసం రెండు రోజుల క్రితమే విశాఖ వెళ్లిందని బంధువులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News