Friday, November 15, 2024

ప్రేమ పెళ్లి….. 15 రోజులకే నవవధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Bride commit suicide in tamilnadu

 

చెన్నై: ఓ యువతిని ప్రేమించాడు… పెళ్లి చేసుకున్న పదిహేను రోజుల తరువాత నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని అమింజికరై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కార్తీక్ అనే యువకుడు భవానీశ్వరీ అనే యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన పదిహేను రోజుల తరువాత కట్నం కావాలని కుటుంబ సభ్యులతో కార్తీక్‌ను ఆమెను వేధించాడు. ప్రియుడిని నమ్మి ఇంట్లో నుంచి బయటకు రావడంతో ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News