Sunday, February 23, 2025

ప్రియుడితో లేచిపోయిన నవ వధువు

- Advertisement -
- Advertisement -

Husband suicide with lover elope

అమరావతి: వివాహం జరిగిన మూడు రోజులకే నవ వధులు ప్రియుడితో లేచిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతితో మంత్రాలయంలో ఓ గ్రామానికి చెందిన యువకుడితో జూన్ 9న పెళ్లి జరిగింది. యువతికి గతంలో శివాజీ అనే ప్రేమికుడు ఉన్నాడు. పెళ్లైన మూడో రోజున ప్రేమ జంట పారిపోయింది. వధువరుల బంధువుల ఆవేశంతో శివాజీ ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గ్రామస్థుల సమాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అల్లర్లు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News