కరోనా వేళ పంజాబ్‌లో లీల
చండీగఢ: పెళ్లి కూతురు కూడా చివరికి కరోనా జరిమానా చెల్లించుకోవల్సి వచ్చింది. పంజాబ్‌లో బోలెడన్ని కలలతో అంతకుమించిన ఫేసియల్‌లు ఇతర అలంకరణలతో దర్జాగా పెళ్లి పందిరికి వెళ్లుతున్న వధువుకు అధికారులు మాస్క్‌వేసుకోనందుకు జరిమానా విధించారు. చండీగఢ్‌లోని సెక్టర్ 8 గురుద్వారా రోడ్‌లో ఈ ఘటన జరిగింది. ఇక కాసేపట్లో తన పెళ్లి , అంతా దూందాం అనుకుంటూ తోటివారితో వెళ్లుతుండగా కారును తనికీ సిబ్బంది నిలిపివేసింది. మాస్క్ ఎందుకు వేసుకోలేదని, ఇందుకు ఫైన్ కట్టాల్సిందేనని పెళ్లికూతురిని అధికారులు నిలదీశారు.
మాస్క్ వేసుకునే దానినే అయితే ఎంతో కష్టపడి, పైగా ఎంతో డబ్బు పెట్టి ఇప్పుడు మేకప్ చేయించుకుని వెళ్లుతున్నట్లు, మాస్క్ పెట్టుకుంటే మేకప్ దెబ్బతింటుందని, అందుకే వేసుకోలేదని ఈ అమ్మాయి వాదించింది. ప్రోటోకాల్ ప్రోటోకాల్ పెళ్లి పెళ్లే, మాస్క్ మాస్కే మేకప్ మేకపే అంటూ ఆమె నుంచి జరిమానా కట్టించుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆమెను వెనుకేసుకువచ్చారని, బ్రహ్మండంగా పెళ్లికి పోతూ ఉంటే ఈ మాస్క్ కట్టుబాటు ఏమిటని నిలదీశారని అక్కడున్న చౌరస్తా ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే మాస్క్ వేసుకోలేదనేది తమ పరిధిలోకి వస్తుంది కాబట్టి రూ వేయి జరిమానా కట్టాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. అక్షరాల మాస్క్ కింద వేయి రూపాయల కట్నం చెల్లించుకున్న తరువాతనే అక్కడి నుంచి పెళ్లి పందిరికి కారును కదలనిచ్చారు.