హైదరాబాద్: ఓ యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ సాఫ్ట్ వేర్ వద్ద నుంచి లక్ష రూపాయలు కాజేసిన సంఘటన హైదరాబాద్ లోని ఆసీఫ్ నగర్ లోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువకుడు పెళ్లి సంబంధాల కోసం మాట్రీమోనీ సైట్ లో తన బయోడేటాను అప్ లోడ్ చేశాడు. తొమ్మిది నెలల క్రితం ఓ యువతి అతడికి ఫోన్ చేసి తాము విజయనగరంలో ఉన్నామని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. కొన్నాళ్లు యువతి, యువకుడు వాట్సాప్ చాటింగ్ చేశారు. యువతి మాటలకు యువకుడి నమ్మడంతో అతడిని మోసం చేయాలని ఆమె భావించింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, ఒక సారి 20 వేలు, 30 వేలు తన ఎకౌంట్ లో యువతి వేయించుకుంది. రూ.1.08 లక్షల రూపాయలు తన బ్యాంక్ ఎకౌంట్ లో వేయించుకున్న తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. యువతి మోసం చేసిందని గ్రహించిన యువకుడు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.