Thursday, January 23, 2025

అత్త నోట్లో సిగరెట్..పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కాబోయే అత్తగారు దమ్ము కొడుతుంటే చూసి భరించలేక పెళి క్యాన్సిల్ అనేశాడు ఓ వరుడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్‌లో ఇటీవల ఈ సంఘటన చోటుచేసుకుంది.

పెళ్లికి ముస్తాబైన వరుడు మండపానికి వచ్చేసి ఆడ పెళ్లివారి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఆడ పెళ్లివారు ఊరేగింపుగా బ్యాండ్ మేళాలతో అక్కడకు చేరుకున్నారు. ఇంతలో సిగరెట్ కాలుస్తూ అతిథులతో ద్యాన్స్ చేస్తున్న కాబోయే అత్తగారు అతడి కంటపడింది. అత్త ప్రవర్తన చూసి చిర్రెత్తుకొచ్చిన పెళ్లికొడుకు ఈ పెళ్లి వద్దంటే వద్దు అంటూ మొండికేసి కూర్చున్నాడు. దీంతో రెండు వైపులకు చెందిన బంధువుల మధ్య ఘర్షణ తలెత్తింది. పెళ్లి రద్దు చేసుకుని పెట్టే బేడా సర్దుకుని ఎవరికి వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంతలో గ్రామ పెద్దలకు ఈ విషయం తెలిసింది. వెంటనే ఇరుపక్షాలకు చెందిన పెళ్లి పెద్దలను పంచాయతీకి పిలిచారు. పెళ్లి జరగాల్సిందేనని పంచాయతీ తీర్మానించింది. చివరకు పెళ్లి కొడుకు ఇష్టం లేకునా వధువుకు తాళి కట్టాడు. ఇంతకీ సిగరెట్ తాగిన అత్తను అల్లుడు క్షమించాడా..లేదా?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News