మేడ్చల్: మేన బావతో ఇష్టం లేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇసి నగర్ కు చెందిన శైలజ(22) ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. మేనత్త కుమారుడు మేనబావతో ఫిబ్రవరి 17న వివాహం జరిగింది. పెళ్లి వేడుక జరిగిన తరువాత అందరూ ఇసినగర్ వచ్చారు. భర్త ఆఫీస్‌కు సంగారెడ్డి వెళ్లగా తల్లి మరో రూమ్‌లో ఉండగా ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ప్యాన్‌కు ఉరేసుకుంది. తలుపు తెరవకపోవడంతో స్థానికుల సహాయంతో డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. వెంటనే శైలజను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి అప్పటికే ఆమె దుర్మరణం చెందింది. పెళ్లికి ముందుకు ఆమె మేనబావ చేసుకోవడం ఇష్టం లేదని పలుమార్లు చెప్పిందని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.