Sunday, December 22, 2024

శోభనం గదిలో వధువు, వరుడు మృతి…. అసలు ఏం జరిగింది?

- Advertisement -
- Advertisement -

 

లక్నో: శోభనం గదిలో నవ వధువు, వరుడు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ప్రతాప్ యాదవ్ అనే యువకుడు (25), పుష్పను(20) మే 30న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన నాలుగు రోజుల తరువాత వారి శోభనం గదిలోకి పంపించారు. మరుసటి రోజు తలుపులు కొట్టి చూడగా ఎవరు తీయకపోవడంతో బలవంతంగా ఓపెన్ చేయడంతో మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నవ దంపతులు గుండెపోటుతో చనిపోయినట్లుగా శవ పరీక్ష నివేదికలో వెల్లడైంది. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి కుమారుడు, కుమార్తె చనిపోవడంతో బంధువులు, స్థానికులు తండోపతండాలుగా తరలి వచ్చారు. యువ జంటను ఒకే చితిపైకి చేర్చి అంతిమసంస్కారాలు నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కన్నీంటిపర్యంతమయ్యారు.

Also Read: పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News