Friday, November 22, 2024

పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఇంట్లో నుంచి పారిపోయి….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పెళ్లి జరిగిన 20 రోజులకే నవ వధువు అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా తోగుట గ్రామంలో నాగరాణి(20)తో అడిక్‌మెట్ ప్రాంతం బాలాజీనగర్‌కు చెందిన సాయి కుమార్‌కు మే 30న పెళ్లి జరిగింది. సాయి కుమార్ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం సాయి ఆఫీస్‌కు వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో 12 గంటల ప్రాంతంలో బట్టలు, బంగారు ఆభరణాలు, నగదును తీసుకొని వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత నాగరాణి కనిపించకపోవడంతో వదిన రేణుక తన మరదికి సమాచారం ఇచ్చింది. సాయికుమార్ ఇంటికి చేరుకొని ఆమె ఫోన్‌ను పరిశీలించగా బాయ్‌ఫ్రెండ్ నుంచి వచ్చిన సందేశాలు కనిపించాయి. వెంటనే సాయికుమార్ తన భార్య కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపాడు. పెళ్లికి ముందు కూడా యువకుడితో నాగరాణి వెళ్లిపోయిందని, ఆమె అదృశ్యం వెనుక అతడి హస్తం ఉండొచ్చని సాయి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News