Monday, December 23, 2024

శోభనం వద్దని నవవధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెన్నై: శోభనం వద్దని చెప్పి నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై రాజధాని తాండయూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనగర్‌లో ప్రకాశ్-గౌరీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏకైక కూతురు రేఖా రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఆమె లవుగా ఉండడంతో ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. రాజశేఖరన్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడంతో ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్తను భార్య దూరంగా పెడుతోంది. ఇదే సమయంలో రేఖ తన పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటి నుంచి ఆఫీస్‌కు వెళ్తోంది.

వారం రోజుల తరువాత ఆమెను తీసుకెళ్లడానికి భర్త వస్తున్నాడని తెలిసింది. వెంటనే ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త మాత్రం విస్తుగొలిపే విషయాలు బయటపెట్టాడు. పెళ్లి జరిగిన వెంటనే శోభనానికి ఏర్పాటు చేశాం కానీ శృంగారానికి తన శరీరం సహకరించడంలేదని ఫస్ట్ రోజు అతడికి దూరంగా ఉందని చెప్పాడు. పుట్టింటి నుంచి తీసుకొచ్చిన తరువాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిద్దామని రాజశేఖరన్‌కు ఆయన తండ్రి తెలిపాడు. వచ్చేలోపు ఆమె ఆత్మహత్య చేసుకుందని అతడు బోరున విలపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News