Friday, January 10, 2025

బంగారం ఇటుకలతో పెళ్లి కూతురి తులాభారం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: సంపన్నుల ఇళ్లలో పెళ్లంటే ఆడంబరాలకు లోటుండదు. డబ్బు మంచినీళ్లలా ప్రవహిస్తుంది. తమ ఇంట్లో జరిగిన పెళ్లి గురించి ఊరంతా పది కాలాల పాటు గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటారు. కొందరు ఖర్చుకు వెరవకుండా ఊరందరికీ భోజనాలు పెట్టడానికి ఉబలాటపడితే కొందరేమో కళ్లు చెదిరే సెట్టింగులు వేసి భారీ స్థాయిలో పెళ్లి జరిపిస్తారు.

అయితే దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఒక పెళ్లి కోటీశ్వరులను కూడా కంగారు పెట్టించే రీతిలో జరిగింది. ఆ పెళ్లికి వచ్చిన అతిథులు సైతం ముక్కు మీద వేళ్లేసుకుని నోరెళ్లబట్టి చూసేలా జరిగిందా పెళ్లి వేడుక. ఇంతకీ ఆ పెళ్లి విశేషమేమిటంటారా..పెళ్లి కూతురిని నిలువెత్తు బంగారంలో తూచి ఆ తండ్రి కట్నంగా ముట్టచెప్పాడు. ఇప్పుడున్న బంగారం రేటుకి ్ద అది సాధ్యమేనా అని అంటారా..ఆ తండ్రికి మాత్రం సాధ్యమే..దుబాయ్‌లో స్థిరపడిన పాకిస్తానీ వ్యాపారి అయిన ఆ తండ్రి తన కుమార్తె పెళ్లిని అంగరంగ వూభవంగా జరిపించడమే గాక వరకట్నంగా తన కుమార్తెను బంగారం ఇటుకలతో తులాభాలం వేశాడు.

ఆ పిల్ల బరువు కూడా తక్కువేమీ లేదు. 70 కిలోల బరువున్న బంగారం ఇటుకలను ఆ పెళ్లికుమార్తె తన భర్తకు కానుకగా ఇచ్చింది. ఇంత బంగారం ఏం చేసుకుంటారని ఆశ్చర్యపోతున్నారా..మనకేం తెలుసు..మీరూ ఈ వీడియో చూసి ఆ తులాభారం ముచ్చట ఏదో తెలుసుకోండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News