Thursday, December 26, 2024

పెళ్లి పీటలపైన ప్రాణం కోల్పోయిన వధువు

- Advertisement -
- Advertisement -

bride who lost her life on wedding day in Vishaka

అమరావతి: ఎపిలోని విశాఖపట్నం మధురవాడలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి పీటలపైనే వధువు సృజన ప్రాణం కోల్పోయింది. జీలకర్ర బెల్లం ప్రక్రియలో వధువు కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సృజన మృతికి గుండెపోటే కారణమని అనుమానిస్తున్నారు. వీరి వివాహం కోసం కళానగర్ లోని ఖాలీస్థలంలో భారీ సెట్టింగ్ వేసి పెళ్లి మండపం ఏర్పాటుచేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News