Wednesday, January 22, 2025

వరద దాటికి తెగిన బిడ్జ్రి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం శివారులోని టేకుమట్ల రాఘవరెడ్డి మధ్య గల బ్రిడ్జి వరదదాటికి తెగింది.వరద ప్రవాహంలో ఇప్పటికే ముగ్గురు గ్రామస్థులు కొట్టుకుపోగా, తాజాగా మరో మహిళ గల్లంతు అయ్యింది. ఇప్పటికే  గ్రామానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్, అధికారులు వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి

బస్సులను వాటర్ బోట్లను ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్మీ కి చెందిన రెండు హెలీకాఫ్టర్లను భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామానికి పంపిస్తున్నట్లు సి.ఎస్ శాంతి కుమారి తెలిపారు. మొరంచపల్లి గ్రామానికి మరో అరగంటలో ఆర్మీ హెలికాప్టర్లు వెళ్లనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News