Sunday, January 19, 2025

చైనాలో వంతెన కూలి 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : ఎడతెరిపి లేని భారీ వర్షాలకు చైనా లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు దెబ్బతిని విపరీత నష్టం జరుగుతోంది. ఆకస్మిక వరదల కారణంగా చైనా లోని షాంగ్సీ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి 8.40 గంటల ప్రాంతంలో హైవేపై ఉన్న వంతెన కూలి దానిపై ప్రయాణిస్తున్న 12మంది మృతి చెందారు. శనివారం అధికారులు ఈ విషయం వెల్లడించారు. 31 మంది గల్లంతయ్యారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మికంగా వరదలు ముంచుకొచ్చాయని అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వంతెన కింద ఉన్న జింక్విన్ నదిలో 17 కార్లు, 8 ట్రక్కులు మునిగిపోయాయి. గల్లంతైన వారిని కనుగొనడానికి 736 మంది రెస్కూ సిబ్బంది, 76 వాహనాలు, 18 పడవలు, 32 డ్రోన్లు రంగం లోకి దిగాయి. ఇప్పటివరకు నదిలోంచి 12 మృతదేహాలను బయటకు తీయగలిగారు. ఒకరిని రక్షించారు. నదిలో పడిన ఐదు వాహనాలను రెస్కూ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని శనివారం అధికారులు వెల్లడించారు.

ఇది కాకుండా వరదల కారణంగా సియాచిన్ ప్రావిన్స్ జిన్హువా గ్రామంలో 30 మంది గల్లంతయ్యారు. హనయుయాన్ కౌంటీలో గ్రామంలో 40 గృహాలు ధ్వంసం అయ్యాయి. ఈ వైపరీత్యంతో రోడ్లు, వంతెనలు ధ్వంసం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రజలను రక్షించడానికి సకల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారికోసం గాలించాలని, ప్రాణనష్టం వీలైనంతవరకు తగ్గించాలని ఆయన ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News