Sunday, January 19, 2025

ప్రారంభానికి ముందే కూలిన బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ లోని ఆరారియా జిల్లా లోని బక్రా నదిపై నిర్మించిన వంతెన ప్రారంభించక ముందే మంగళవారం ఉదయం భారీశబ్దంతో ఒక్కసారి కూలిపోయింది. దాదాపు రూ.12 కోట్లు ఖర్చుతో నిర్మాణం పూర్తయినా, రెండు వైపులా అప్రోచ్ రోడ్ల పనులు పూర్తికానందున ఇంకా ప్రారంభించలేదు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తొలుత మూడు పిల్లర్లు కూలిపోయినట్టు గుర్తించారు.

నిర్మాణ సంస్థ నిర్లక్షం వల్లనే ఇది కూలిపోయిందని స్థానిక ఎమ్‌ఎల్‌ఎ విజయ్ మండల్ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో ఇదే రాష్ట్రం లోని సుపౌల్ జిల్లా కోసి నదిపై నిర్మించిన ఓ వంతెన కూలిపోయి ఒకరు మృతి చెందగా, పదిమంది గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News