Friday, December 27, 2024

నిధుల జాప్యం.. సగంలోనే నిలిచి పోయిన బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : మండల పరిదిలోని భగత్‌సింగ్‌నగర్ గ్రామం,కంపగూడెం గ్రామాల మద్య గల పాములేరు వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పిఎమ్‌జిఎస్‌వై పధకం కింద 3 కోట్ల రూపాయిలను మంజూరు చేయడం జరిగినది.ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామానాగేశ్వరరావు,అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు గత మే నెల 10 వ తేదిన శంకుస్థాపన చేసినారు.టెండర్‌లో బ్రిడ్జి నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంబిస్తే నిధులు విడుదల అవుతాయనే ఆశతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంబించినారు. దాదాపు 1.50 లక్షల వరకు ఖర్చు చేసి పనులను చేయడం జరిగినది అని కాంట్రాక్టర్ తెలిపారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక్క పైసా కూడా విడుదల కాలేదనే కారణంతో కాంట్రాక్టర్ గత వర్షాకాలం నుండి పనులను నిలిపి వేయడం జరిగినది. పిఎమ్‌జిఎస్‌వై నిధులలో కేంద్ర ప్రభుత్వం 60%,రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను విడుదల చేయవలసి ఉందని కాంట్రాక్టర్ తెలిపారు.ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ములకలపల్లి నుండి వివిద గ్రామాలకు వెల్లడానికి దగ్గర కావడంతో పాటు అనుకూలంగా ఉంటుంది.బ్రిడ్జి మంజూరు అయిన సమయంలో తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆనందపడినారు.ఇంతలోనే నిధులు విడుదల కాక పోవడంతో నిర్మాణ దశలోనే బ్రిడ్జి పనులను కాంట్రాక్టర్ నిలిపి వేయడంతో ప్రజలు నిరాశకు గురైనారు.

ప్రజల కష్టాలు తీరాలంటే బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని ప్రజలు పేర్కోంటున్నారు.పనులు ప్రారంబించాలంటే కాంట్రాక్టర్‌కు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తె తిరిగి పనులు కొనసాగుతాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై పిఆర్.ఎఇ.శివలాల్ ను వివరణ కోరగా కాంట్రాక్టర్ బిల్లులు రావడంలేదని పనులను నిలిపి వేసిన మాట వాస్తవం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News