Monday, January 20, 2025

ఫలించిన వల్లంపల్లి వాసుల కల

- Advertisement -
- Advertisement -

మేడిపల్లిః వల్లంపల్లి గ్రామం వద్ద ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువపై రూ.2.60 కోట్లతో ఏర్పాటు చేయనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆదివారం ఎంఎల్‌ఎ రమేష్‌బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ..వల్లంపల్లి వాసుల కల సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, నిధులు మంజూరు చేసిన సిఎం కెసిఆర్‌కు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుతున్నానని వేములవాడ ఆయన అన్నారు. రాజకీయాలకు ధీటైన సమాధానం అభివృద్ధి కోసం అంకిత భావంతో ప్రజలకు సేవ చేయడమేనని అన్నారు. రైతులను, మహిళలను ముఖ చిత్రంలో పెట్టింది సిఎం కెసిఆర్ అని, ఒక్క వల్లంపల్లి గ్రామానికి దాదాపు కోటి రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం ద్వార అందజేయడం సిఎం కెసిఆర్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆనాడు తలసరి ఆదాయం లక్ష పది వేలు ఉంటే రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో రూ.3 లక్షల 10 వేలు పెంచింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేని ఢిల్లీ గణాంకాలు చెపుతున్నాయన్నారు. మూడో సారి సిఎంగా కెసిఆర్‌ను గెలిపించి పట్టం కట్టాలన్నారు. వచ్చే ఆగస్టు లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం అని, అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్లు, ప్రభుత్వం జాగ ఉంటే పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. అందుకు రూ.3 లక్షలు వచ్చే మాసం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దళిత బంధు మొదటి దఫాలో 100 యూనిట్లు అందించడం జరిగిందని, వాటిని పారదర్శకంగా నిరుపేదలకు అందించామన్నారు.

1100 దళిత బంధు యూనిట్లు రానున్నాయని, వాటిని కూడా పారదర్శకంగా నైపుణ్యం, పట్టుదల కలిగిన యువతీ యువకులకు అందిస్తామని ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్‌పివైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు, ఎంపిపి దొనకంటి ఉమాదేవి, మార్కెట్ కమిటి చైర్మన్ రమ్య,ఆదిరెడ్డి, సర్పంచ్ వెల్మ సమతనవీన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News