Wednesday, January 22, 2025

ప్రమాదకరంగా పాత వంతెన

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: పొలంపల్లి గ్రామం మీదుగా మానకొండూర్ నుంచి హుస్నాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని పాత వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పూర్తిగా దెబ్బతిని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. మానకొండూర్ నుంచి హుస్నాబాద్ వరకున్న రోడ్డును ఇటీవల డబుల్ రోడ్డుగా మార్చారు. అయితే ఈ రోడ్డును అసంపూర్తిగా నిర్మించిన కాంట్రాక్టర్ వంతెనలతో పాటు రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాల్లో విస్తరణ పనులు చేపట్టలేదు.

దీంతో పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని వంతెన పూర్తిగా దెబ్బతినడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల భారీన పడుతున్నారు. ఏ క్షణాన వంతెన కూలుతుందోనని భయపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెనను నిర్మించాలని ప్రయాణికులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News