Tuesday, December 24, 2024

వంతెన కూల్చి తానూ కూలి

- Advertisement -
- Advertisement -

Bridge over Sukhtawa river collapses as 128-wheel truck crosses

128 చక్రాల భారీ ట్రక్కు విధ్వంసం

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 128 చక్రాల భారీ ట్రక్కు వెళ్లడంతో సుక్తావా నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. భోపాల్ నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఈ వంతెన ఉంది. ఆదివారం ఉదయం లోడ్‌తో వెళ్లుతున్న ఈ పొడవాటి ట్రక్కు బరువును తట్టుకోలేక వంతెన కూలిందని అధికారులు తెలిపారు. వాహనం ఎండిపోయి ఉన్న నదిలో పడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. భారీ స్థాయి విద్యుత్ పరికరాలు యంత్రాలతో ఈ వాహనం హైదరాబాద్ నుంచి ఇటార్సీ పవర్ గ్రిడ్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో వంతెనను కూల్చి కుప్పకూలింది. ఈ మార్గం గుండా ప్రతిరోజూ వేలాదివాహనాలు వెళ్లుతుంటాయి. వంతెన కూలడంతో దారిమళ్లింపులతో వాహనదారులు, ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News