Tuesday, November 5, 2024

మూసీనదిపై రూ.2.25 కోట్లతో బ్రిడ్జి పనులకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: దశాబ్దాల కాలంగా ఉన్న సమస్య శివారెడ్డి గూడెం నుంచి సూరెపల్లి వరకు మూసినదిపై బ్రిడ్జి నిర్మాణం పనులకు టెండర్ కోరుతూ నిధులు మంజూరు చేయడంతో సూరెపల్లి ఆకుతోటబావితండ పచ్చర్రబోడుతండా గ్రామప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుందని అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు మండల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరిపోనున్నాయని. భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం- భువనగిరి మండలం సూరెపల్లి గ్రామాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన మూసినదిపై వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చొరవతో నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీంతో అటు పోచంపల్లి మండలం ఇటు భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజల చిరకాల వాంఛ అయిన మూసినదిపై బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.

ఇరు మండలంలోని గ్రామాలను కలుపుతూ శివారెడ్డిగూడెం సూరెపల్లి గ్రామల మధ్య మూసినదిపై బ్రిడ్జి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని అన్నారు. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మూసినదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులు కేటాయిచడంపై సూరెపల్లి ఆకుతోటబావితండ పచ్చర్రబోడుతండా గ్రామ వాసులు హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు అధ్వర్యంలో సూరెపల్లి ఆకుతోటబావితండ పచ్చర్రబోడుతండా గ్రామశాఖ అధ్యక్షులు కొండూరి సత్యానారయణ గౌడ్, హాలవత్ రెడ్డినాయక్, కునుసోతు భగవాన్ నాయక్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు.

మూసినదిపై బ్రిడ్జి కోసం సూరెపల్లి ఆకుతోటబావితండ పచ్చర్రబోడుతండా గ్రామ ప్రజలు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారని ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బొడ్డు లక్ష్మి మైసయ్య, కెతావత్ సక్రమ, కునుసోతు రెడ్డి నాయక్, పీఏసిఎస్ వైస్ చైర్మన్ కేతావత్ మహేందర్ నాయక్, బిఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నర్రా చంద్రశేఖర్, బిఆర్‌ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు సత్యానారయణ గౌడ్, హాలవత్ రెడ్డినాయక్,  తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News