Monday, December 23, 2024

చిన్నారుల ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : జిల్లా కేంద్రంలో ఉన్న శిశుగృహ, బాలసదనంల ను శనివారం తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా శిశుగృహలోని శిశువులకు, బాలసదనంలోని బాలికల సంరక్షణ నిమిత్తమై వర్షా కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలసినదిగా అధికారులను ఆయన ఆదేశించారు.

శిశువు తన తల్లి కడుపులోకి వచ్చినప్పటి నుండి 1 8 సంవత్సరాలు నిండేంత వరకు ప్రభుత్వ మే అన్ని విధాలుగా తోడ్పాటును ఇస్తుందని, దానిలో భాగంగా గర్భవతులకు పౌష్టికాహార పాలు, గుడ్లు, భోజనం ఇస్తూ తల్లి ప్రసవం అనంతరం ప్రభుత్వం నుండి నగదు తో పాటు తల్లికి బిడ్డకు ఇంటి అడపడచుకు ఇచ్చినట్లుగా బట్టలతో కూడిన కె సిఆర్ కిట్లను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. తదుపరి శిశువులకు అన్ని రకాల ప్రోటీన్‌లతో కూడిన బాలామృతంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.

పాఠశాలకు వెళ్ళే విద్యార్ధులకు సన్న బియ్యంతో కూడిన భోజనం ప్రభుత్వం అందిస్తుందన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కల్పిస్తున్నా ఇంకా గ్రామీణ స్థాయిలో ప్రజలలో అవగాహన లోపం కారణంగా, ప్రభుత్వ సంక్షేమ అందుకోలేకపోతున్నారని , ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షే మ పధకాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా అందరూ ప్రజలకు ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి కమిటీల ద్వారా అవగాహన కల్పించాల్సిన అవస రం ఇంకా ఉందని ఆయన అన్నారు.

మహిళల కోసం కోసం సంక్షేమ పథకాలతో పాటు పెళ్లిలకు కళ్యాణ లక్ష్మీ/ షాధీ ముభారక్ పేరిట వారికి నగదును అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానీదే అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి నుండి సి.హెచ్. కృష్ణయ్య, ఈద భాస్క ర్, వి. లక్ష్మీ కిరణ్, జిల్లా సంక్షేమ అధికారి కె.వి. కృష్ణవేణి, కో-ఆర్డినేటర్ కు మారి ఇ. హరిత, జిల్లా బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది కె. గణేశ్, శ్రీమతి యన్.విద్య,సి.హెచ్. నరసింహా రావు, చైల్ లైన్ సిబ్బంది బాలకిషన్, బాలసదనం, శిశుగృహ సిబ్బంది జ యమ్మ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News