Wednesday, January 22, 2025

ఉజ్వల తెలంగాణ

- Advertisement -
- Advertisement -

సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్‌ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఎఐ సిటీ..
టిఎస్‌పిఎస్‌సి ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం..

మూసీని తిరిగి హైదరాబాద్ జీవనాడిగా మారుస్తాం
త్వరలో మరో రెండు గ్యారంటీల అమలు
ప్రజావాసాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్ల ఏర్పాటు

హరిత ఇంధనాల ప్రోత్సాహానికి సమగ్ర పాలసీ
ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ తమిళి సై

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన మొదలైందని గవర్నర్ త మిళిసై సౌందర రాజన్ అన్నారు. ప్రజాభవన్ చుట్టూ కంచె తొలగించి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నార ని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం అ య్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఉభ య సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాళోజీ కవితతో తన ప్ర సంగాన్ని ప్రారంభించారు. ఉజ్వల తెలంగాణను సా కారం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశా రు. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామని గవర్నర్ పేర్కొన్నారు. తమ ప్రభు త్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమ లు చేశామన్నారు. త్వరలోనే మరో రెండు అమలు చే స్తామని గవర్నర్ తమిళిసై తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై కూడా తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహాలక్ష్మి పథ కం కింద ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని గవర్నర్ తెలిపారు.
కొత్తగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులు
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, వి ద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞత లు చెబుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కార్‌కు ఈ రాష్ట్రం ధన్యవాదాలు తెలుపుతోందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోందని ఆమె వెల్లడించారు. తెలంగాణకు కొత్తగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఇటీవల దావోస్ పర్యటనలో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయన్నారు. ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రతి రూపాయి తెలంగాణ సంక్షేమం, ప్రజల పురోగతికి దోహదపడేలా బడ్జెట్ ఉంటుందని గవర్నర్ హామీ ఇచ్చారు. వెయ్యి ఎకరాల్లో 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని గవర్నర్ తెలిపారు.
గత రాష్ట్రం అప్పుల కుప్పగా…
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని, తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దశాబ్దంగా నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు. గత సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. టిఎస్పీఎస్సీ, ఎస్‌హెచ్‌ఆర్సీ వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పని చేసే స్వేచ్ఛ కల్పిస్తామని గవర్నర్ వెల్లడించారు. టిఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోందని ఆమె వెల్లడించారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని, తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడరని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకోస్తామన్నారు. మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నామని, ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ..
రాష్ట్రంలో అత్యధిక జనాభాకు జీవనోపాధిని సమకూరుస్తున్న వ్యవసాయం వెన్నెముకగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పోషించే కీలక పాత్రను గుర్తిస్తూ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, పంట మార్పిడి కార్యక్రమాలు, ఉద్యానవన అభివృద్ధి, నాణ్యమైన విత్తనా లు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతాంగ సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నూతన ఎంఎస్‌ఎం ఈ విధానాన్ని తీసుకురావడంతో పాటు ఎంఎస్‌ఎంఈలకు సాయపడటానికి, వారి ఇబ్బందులను నివారించడానికి ఒక ప్రత్యేక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చే స్తామన్నారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలకు ప్రభుత్వ స హకారం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో డిజిటల్ మౌ లిక సదుపాయాలను సృష్టించడమే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలకు కనీస ధరలకే అందుబాటులోకి తీ సుకురావడంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రతి కుటుంబం వేగవంతమైన డిజిటల్ అనుసరణ అవకాశాల ద్వారా వచ్చే ప్రయోజనం పొందేందుకు ఒక సార్వజనీన సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నా రు. హైదరాబాద్‌కు కృత్రిమ మేథస్సుకు ప్రధాన కేంద్రం గా అభివృద్ధి చేస్తామన్నారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.2 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్‌లుగా మార్చనుందని తెలిపారు.
రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు
రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం ఏ ర్పాటు చేస్తుందన్నారు. వేగంగా మారుతున్న జాబ్ మార్కె ట్ డిమాండ్‌లకు అనుగుణంగా అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యువతను సన్నద్ధం చేస్తూ ఇవి ప్రతిభా కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. విద్యుత్ అవసరాలకు రాష్ట్రం ప్రధానంగా బొగ్గుపై ఆధారపడుతోందన్నారు. విద్యుత్ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడానికి అలాగే పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛ ఇంధనపు వాటాను పెంచాల్సి ఉంటుందని తెలిపారు. అధిక డిమాండ్ అవసరాలను తీర్చడానికి హరిత ఇంధ నం (సౌర), పవన, హైబ్రిడ్‌తో పాటు నిల్వ ఇంధ నం వంటి అన్ని రకాల హరిత ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక సమగ్ర ‘ఇంధన పాలసీ’తో ముం దుకు రానుందని గవర్నర్ పేర్కొన్నారు. హరిత ఇంధనం వాటాను గణనీయంగా మెరుగుపరిచి, 2030 సంవత్స రం నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ తమిళిసై అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News