Thursday, January 23, 2025

సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలలో వెలుగులు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రూ.20లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ముందుకు పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే అన్నారు.సిఎం కెసిఆర్ సారధ్యంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి చేయడమే ధ్యేయంఅని అన్నారు.

పంచాయతీల కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌ది
గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం డిండి మండల కేంద్రంలో గ్రామపంచాయితీ కార్మికుల సమ్మేలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి మధవరం సునితజనర్ధన్‌రావ్, రాజినేని వెంకటేశ్వర్ రావ్,నాగర్జునరెడ్డి,సర్పంచ్ పేటా రాధవెంకటయ్య, రైతుబంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్ రావ్,పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రావ్,పేర్వాల జంగారెడ్డి, మాధవరం జనార్ధన్ రావ్,శ్రీను,కలీమ్,శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News