Wednesday, January 22, 2025

బ్రిజ్ భూషణ్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు

- Advertisement -
- Advertisement -

మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసుల నివేదిక

తజకిస్థాన్‌లో ఆయన అసభ్య ప్రవర్తన నిజమేనని నిర్ధారణ

కోర్టుకు ఢిల్లీ పోలీస్‌ల నివేదిక

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చే శాడనీ ఢిల్లీ పోలీస్‌లు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్టు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. అలాగే , మ హిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభు త్వం నియమించిన కమిటీ బ్రిజ్ భూషణ్‌కు క్లీన్‌చీట్ ఇవ్వలేదనే విషయా న్ని కోర్టులో ప్రస్తావించారు. ఈమేరకు ఢిల్లీ పోలీస్‌లు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్ భూషణ్ తన గదికి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నాడని, ఆమె ప్రతిఘటించడంతో ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేసినట్టు తన చర్యను బ్రిజ్ భూషణ్ సమర్ధించుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు.

అదే సమయంలో అనుమతి లేకుండా తన చొక్కాను పైకెత్తి అసభ్యంగా ప్రవర్తించాడని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదులో పేర్కొన్నారని , ఈ రెండు ఘటనలు బ్రిజ్ భూషణ్ తాను చేస్తున్న చర్యల పట్ల పూ ర్తి అవగాహనతో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఢిల్లీ పోలీస్‌లు కోర్టుకు తెలిపారు. కొద్ది నెలల క్రితం బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పో లీస్‌లకు ఫిర్యాదు చేశారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మైనర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మరోవైపు బ్రిజ్ భూషణ్ పై మిగిలిన మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్టు కోర్టుకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News