Sunday, December 22, 2024

లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్: ఢిల్లీ పోలీసుల చార్జిషీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, బెదిరింపులకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ పేర్కొంది. ఈ నేరాలకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌ను ప్రాసిక్యూట్ చేసి శిక్షించాల్సిందేనని సిటీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఇదివరకే పరిగణనలోకి తీసుకున్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్(ఎసిఎంఎం) హర్జీత్ సింగ్ జస్పాల్ జులై 18న మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టుకు హాజరుకావాలంటూ బ్రిజ్ భూషణ్‌కు సమన్లు జారీచేసింది.ఇదే కేసుకు సంబంధించి అదే రోజున హాజరుకావాలంటూ సస్పెన్షన్‌కు గురైన డబ్లుఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News