Friday, December 20, 2024

రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

దేశం విడిచి వెళ్లొద్దని షరతు విధింపు
న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ , జాతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్ శరణ్ సింగ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి ఢిల్లీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అతడితోపాటు డబ్లుఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్‌తోమర్ సింగ్‌కు కూడా న్యాయస్థానం బెయిలిచ్చింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ జరిపింది. విచారణకు బ్రిజ్ భూషణ్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. నిందితుల బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ పోలీస్‌లు వ్యతిరేకించలేదు. దీంతో వీరికి రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా నిందితులు దేశం విడిచి వెళ్ల రాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కోర్టు షరతు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News