Wednesday, January 22, 2025

రెజ్లర్లతో బ్రిజ్ భూషణ్ దాదాగిరి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎంపి వస్తాద్ బ్రిజ్ భూషణ్ ఆగడాలు ఇప్పుడు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తన వద్దకు వచ్చే పలువురు రెజ్లర్లను ఆయన తిట్టేవాడని కొందరినైతే నోర్మూసుకో అనే వాడని ఢిల్లీ పోలీసులు స్థానిక కోర్టుకు తెలిపారు. ఈ బిజెపి ఎంపిపై దాఖలు అయిన లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం తాజా వాదోపదవాదాల దశలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు ఈ వ్యక్తి తమ పట్ల లైంగిక వేధింపులకు దిగాడని పేర్కొనడం నెలల తరబడిగా వివాదానికి దారితీస్తూ వచ్చింది. స్థానిక రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. క్రీడలలో ఉండాలనుకున్నా,

రాణించాలనుకున్నా నోర్ముసుకుని ఉండండని భూషణ్ బెదిరించే వాడని పోలీసు విభాగం తరఫున వారి లాయరు తమకు అందిన సమాచారాన్ని కోర్టుకు తెలిపారు. కుస్తీ కావాల్నా,, ఇళ్లకు పోతారా? తేల్చుకోండి చెప్పింది చేస్తేనే ఇక్కడుంటారని కొందరితో చెప్పేవాడని , ఇక మరికొందరు మహిళా రెజ్లర్లను ఆపివేసి ఆయన తన దుస్తుల గురించి అడిగేవాడు. ఈ కుర్తా తనకు ఏ విధంగా ఉందని , బాగా ఉందా? అని వారిని దాదాపుగా పట్టుకున్నంత పనిచేసి మరీ అడిగేవాడని , అమ్మాయిల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని పోలీసు కౌన్సిల్ ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News