Monday, January 20, 2025

ఎల్లగిరి అభివృద్ధికి బృందావన్ ల్యాబ్ సహకారం భేష్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ఎల్లగిరి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి స్థానిక బృందావన్ ల్యాబ్ పరిశ్రమ యాజమాన్యం అందిస్తున్న సహకారం ఎంతో భేషుగ్గా వుందని ము నుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరిలో బృందావన్ ల్యాబ్ పరిశ్రమ ఆర్ధిక సహకారంతో రూ. 30 లక్షల నిధులతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్లకు శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన బృందావన్ పరిశ్రమ యజమాని రామయ్యను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇతర పరిశ్రమల యజమానులు కూడా రామయ్యను ఆదర్శంగా తీసుకుని గ్రామాల అభివృద్దిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు.

ఈ కార్యక్ర మంలో చౌటుప్పల్ సింగిల్ విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, -ఎల్లగిరి సర్పంచ్ రిక్కల ఇందిరా సత్తిరెడ్డి, ఉప సర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News