Monday, December 23, 2024

కెసిఆర్ ని రమ్మనండి: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీలో దీక్ష చేయాలని బిఆర్ఎస్ ఎంఎల్ఏలు హరీశ్ రావు, కెటిఆర్ డిమాండ్ చేయడంపై సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం అన్నారు. అయితే ప్రతిపక్ష నేతగా కెసిఆర్ కూడా రావాలన్నారు. మీరే తేదీని కూడా డిసైడ్ చేయండన్నారు.

‘తెలంగాణకు నిధులు తెచ్చుడో..సచ్చుడో తేల్చుకుందాం’ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష నేతలు సూటిపోటీ మాటలనుకున్నారు. దాంతో సభ వేడెక్కినంత పనయింది. ఆంధ్ర సిఎం చంద్రబాబు నాయుడు సైలంట్ గా కావలసింది రాబట్టుకున్న నేర్పు ఇక్కడ కనబడడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News