Monday, December 23, 2024

ప్రజలకు చేరువలో రెవెన్యూ పాలన

- Advertisement -
- Advertisement -

రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వానికి ట్రెసా వారధి
రెవెన్యూ ఉద్యోగుల సమావేశంలో ఆచార్య కోదండ రామ్

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు శనివారం తూంకుంటలో జరిగింది. రెవెన్యూ శాఖ పునర్వైభవం కోసం, రైతుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన ప్రొ. కోదండరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ..రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ముఖ్యంగా రెగ్యులరైజ్ చేయబడిన విఆర్‌ఏలు, విఆర్‌వోలు ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా వారి వెంట ఉండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అస్తవ్యస్థమైన భూ రికార్డుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్ళే చురుకైన రైతుబిడ్డ రెవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ప్రజలతో మమేకమై ప్రజల కప్టాలు తెలిసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ శాఖామాత్యులు కావడం రెవెన్యూ శాఖ పటిష్ఠంగా పనిచేస్తుందని, ప్రజలకు మేలైన సత్వర సేవలు అందిస్తుందన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాయిస్ మెసేజ్ పంపుతూ ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు నన్ను కలిసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించినప్పటికీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వలన రాలేకపోయానని,మిమ్మల్నందరినీ మరోసారి తప్పకుండా కలుస్తానన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, భూ రికార్డుల నిర్వహణ లో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండువేలకు పైగా హాజరైన రెవెన్యూ ఉద్యోగులు వివిధ అంశాలపై చర్చించి, సమస్యల పరిష్కారం కోసం 9 తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పడిగెల రాజ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, దేశ్య, నిరంజన్, శాస్త్రి, నాగమణి, కార్యదర్షులు శైలజ, వాణి, నదీంఖాన్, వి. వెంకటేశ్వర్లు, పల్నాటి శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వాణి రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ దేశ్‌పాండే, శ్రవణ్ , సభ్యులు దాదేమియా, వెంకటేశ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్షులు సుధాకర్, రామకృష్ణారెడ్డి తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు రమన్ రెడ్డి, సునీల్, రెహమాన్, బొమ్మ రాములు, కృష్ణమూర్తి, కిషన్, వెంకట్‌రెడ్డి, వకీల్, జయంత్, కృష్ణ, జమీల్, మధుకర్, రాజ్‌ప్రకాశ్, శ్రీనివాస్‌లతో పాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News