Wednesday, January 22, 2025

పందుల నుంచి మనిషికి.. బ్రిటన్‌లో తొలిసారి హెచ్1ఎన్2

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటన్‌లో తొలిసారిగా మనుష్యులలో స్వైన్‌ఫ్లూ రకం వైరస్ హెచ్1ఎన్2ను గుర్తించారు. ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య సంస్థ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫ్లూ సోకిన వ్యక్తికి స్వల్ప అస్వస్థతకు గురై తరువాత కోలుకున్నారు. ఇప్పటివరకూ ఈ రకం ఫ్లూ వైరస్ కేవలం పందులలో వ్యాపించింది. మనిషికి ఈ ఫ్లూ సోకడం ఇదే తొలిసారి కావడంతో బ్రిటన్ ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ఈ రకం ఫ్లూతో ఉన్న పందుల్లో కనుగొన్న వైరస్‌లు ఇప్పుడు ఈ బాధిత వ్యక్తిలో ఉన్నట్లు నిర్థారిచినట్లు యుకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యుకెహెచ్‌ఎస్‌ఎ) డైరెక్టర్ మీరాచంద్ తెలిపారు. జంతువుల్లో వ్యాప్తిలో ఉన్న ఈ వైరస్ మనుష్యుల్లో విస్తరించకుండా ఉండేందుకు బ్రిటన్ అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News