Monday, December 23, 2024

భావితరాల గృహాలు… బ్రిటన్ ప్రయోగ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

కర్బన వాయువులను అరికట్టడం, వాతావరణ మార్పులతో వచ్చే సమస్యలను పరిష్కరించడం, ఇంధనం పొదుపు చేయడం తదితర ప్రత్యేకతలు కలిగిన భావి తరాల గృహాలకు శాస్త్రవేత్తలు రూపకల్పన చేస్తున్నారు. ఈ నమూనా గృహాలపై ప్రయోగశాలలో పరీక్షలు చేస్తున్నారు. బ్రిటన్ లోని మాంచెస్టర్ కేంద్రంగా ఉన్న సాల్ఫోర్డ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో భారీ గిడ్డంగిని పోలిన లేబొరేటరీలో ఈ నమూనా గృహాలను రెండిటిని రూపొందించారు. ఎనర్జీ హౌస్ 2.0 కు స్వాగతం అనే శీర్షికతో ప్రయోగాన్ని చేపట్టారు. వర్షం, గాలి, సూర్యుని వెలుగు, మంచు, ఇవన్నీ తిరిగి సృష్టించ బడతాయి.

40 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు మార్చు కోవచ్చు. ఇవన్నీ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేట్ అవుతుంటాయి. తాము సాధించిందేమిటంటే వాతావరణ పరిస్థితులను తిరిగి సృష్టించ గలగడం. ఇవన్నీ భూమిపై ఉన్న 95 శాతం జనాభాకు త్వరలో అనుభవం లోకి వస్తాయని సాల్ఫోర్డ్ యూనివర్శిటీ ఎనర్జీ హౌస్ లేబొరేటరీస్ అధినేత ప్రొఫెసర్ విల్‌స్వాన్ చెప్పారు. ఈ ప్రయోగ గృహంలో రెండు గదులు ఉంటాయి. అవి ఒకే సమయంలో వేర్వేరు వాతావరణాల అనుభవాలను పొందుతుంటాయి. అవి ప్రపంచం లోని వివిధ రకాల గృహాలను పరీక్షిస్తుంటాయి. ఈ మేరకు ఇలాంటి వేర్వేరు వాతావరణ, ఉష్ణోగ్రతల నివాసాలను అందివ్వగలమో అర్థం చేసుకుంటున్నామని విల్‌స్వాన్ చెప్పారు. త్వరలో ఈ గృహాలు అందుబాటు లోకి వస్తాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో మొదటి ఇంటిని బ్రిటన్ ప్రాపర్టీ సంస్థ బర్రాట్ డెవలప్‌మెంట్స్ , ఫ్రెంచి మెటీరియల్స్ సంస్థ సెయింట్ గొబెయిన్ నిర్మించాయి.

కొయ్య పలకల చట్రాలు, ఇన్సులేషన్, పైకప్పుపై సౌర ఫలకాలతో ఇటుకలను అమర్చి రూపొందించారు. వివిధ రకాల హీటింగ్ సిస్టమ్స్, ఎయిర్ సోర్స్ హీట్ పంప్స్, తదితర వ్యవస్థలన్నిటినీ శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. రూమ్‌లో గోడల అడుగున హాట్ వాటర్ సర్కూట్. గోడల నుంచి ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా మరింత వేడి పుట్టుకు వస్తుంది. ఇన్‌ఫ్రారెడ్ రేడియేటర్లుగా అద్దాలు కూడా పనిచేస్తాయి. ఈ గృహాల్లో నివసించేవారు ఒకే ఏకైక కంట్రోల్ సిస్టమ్‌తో వీటిని అజమాయిషీ చేయవచ్చు. ఇంతకీ ఈ అత్యంత ఆధునిక సాంకేతిక గృహాల వల్ల బయట ఎంత మంచు కురిసినా వెచ్చగా హాయిగా గదిలో గడప వచ్చు. అలాగే చల్లదనం కావాలన్నా తగిన సూర్యకాంతి కావాలన్నా ఏదైనా సరే వాతావరణాన్ని మనకు అనుకూలంగా తిరిగి సృష్టించ వచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News