- Advertisement -
లండన్: అమెరికా, ఐరోపా సమాఖ్య బాటలోనే బ్రిటన్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెలపై ఆంక్షలు విధించింది. పుతిన్ కుమార్తెలు కేతిరినా తిఖోనోవా, మరియా వొరోంత్సావాలతోపాటు రష్యా విదేశాంగ మంత్రి సర్గె లావ్రోవ్ కుమార్తె యెకాతెరినా వినోకురోవాల ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధాలను విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి 1200 మందికి పైగా రష్యా పౌరులు, వ్యాపార సంస్థలపై ఆంక్షలు విధించినట్లు బ్రిటన్ తెలిపింది. పశ్చిమ దేశాలన్నీ కలిపి ఇప్పటివరకు 275 బిలియన్ పౌండ్ల(360 బిలియన్ డాలర్లు) రష్యా ఆస్తులను స్తంభింపచేసినట్లు బ్రిటన్ తెలిపింది. రష్యా విదేశీ మారక నిల్వలలో ఇది 60 శాతం ఉంటుందని కూడా తెలిపింది.
- Advertisement -