Sunday, February 23, 2025

రష్యా ఎయిర్‌లైన్స్‌పై బ్రిటన్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Britain imposes sanctions on Russian airlines

లండన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై బ్రిటన్ గురువారం తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం రష్యాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ అధీనంలోని ఏరోఫ్లోట్‌తో పాటుగా ఉరల్ ఎయిర్‌లైన్స్, రోస్సియా ఎయిర్‌లైన్స్‌లు బ్రిటన్‌లోని విమానాశ్రయాల్లో తమకోసం కేటాయించిన లాండింగ్ స్లాట్‌లను ఎవరికీ వ్రియించడానికి వీలుండదు. బ్రిటన్‌తో పాటుగా పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రష్యా ఎయిర్‌లైన్స్‌కు లాభసాటి అయిన ఈ లాండింగ్ స్లాట్‌లను విక్రయిస్తే దాదాపు 50 మిలియన్ పౌండ్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే ఇప్పుడు తాజాగా విధించిన ఆంక్షల కారణంగా అవి ఈ లాండింగ్ స్లాట్‌లను అమ్మడానికి వీలుండదు. అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై తన క్రూరమైన దాడిని కొనసాగించినంత కాలం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తాము టార్గెట్ చేస్తూనే ఉండామని బ్రిటన్ విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News