Sunday, December 22, 2024

బ్రిటన్ రాజు చార్లెస్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్..

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ రాజు చార్లెస్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణైంది. ఇటీవల ప్రొస్టేట్ గ్రంథికి వాపు రావడంతో ఆసుపత్రిలో అందుకు సంబంధించిన చికిత్స చేయించుకున్నపుడు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 75 ఏళ్ల కింగ్ చార్లెస్‌కు చికిత్స ప్రారంభమైందని, ఆయన పూర్తి ఆశాజనకంగా ఉన్నారని ప్యాలెస్ తెలిపింది.

ఇటీవల ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినపుడు మరో విషయం బయటపడిందని, తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్‌గా దాన్ని గుర్తించారని ప్రకటనలో తెలిపింది. క్యాన్సర్‌కు సంబంధించి ఆయనకు రెగ్యులర్ చికిత్స ప్రారంభమైందని, ్రఆయనను బహిరంగ సమావేశాలలో పాల్గొనవద్దని డాక్టర్లు సూచించారని, అయితే ఆయన నిర్వహించాల్సిన అధికారిక విధులు, ప్రైవేట్ సమావేశాలు యథావిధిగా జరుగుతాయని ప్యాలెస్ తెలిపింది.

త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్ష
ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న బ్రిటన్ రాజు చార్లెస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. కింగ్ రాచ్లెస్ త్వరితంగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని భారత ప్రజల తరఫున తాను ఆకాంక్షింస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కాగా..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా బ్రిటిష్ రాజు చార్లెస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News