Monday, December 23, 2024

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బ్రిటన్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

లండన్ : లండన్ లోని ఇండియా యుకె ఎచీవర్స్ హానర్స్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ గౌరవ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారం లభిస్తుంది. గతవారం అవార్డుల వేడుకలో ఈ అవార్డు ప్రకటించారు.

బ్రిటన్ లోని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్యూమ్ని యూనియన్ (ఎన్‌ఐఎస్‌ఎయు) ఈ అవార్డును ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు తరువాత ప్రదానం చేస్తారు. బ్రిటిష్ యూనివర్శిటీల్లో చదువుకుని జీవితంలో ఘన విజయాలు సాధించిన భారతీయులకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ పురస్కారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్‌ఐఎస్‌ఎయు బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డిఐటి) భాగస్వామ్యంతో ఇండియా యుకె ఎచీవర్స్ హానర్స్ ఇవ్వడం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News