నియామకానికి కింగ్ చార్లెస్-3 ఆమోదం
సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం
కన్జర్వేటివ్‌ల ఘోర పరాజయం
ఓటమిని ఒప్పుకున్న రిషి సునాక్
గ్రేట్ బ్రిటన్‌లో నూతన అధ్యాయం మొదైలంది. కన్జర్వేటివ్‌ల 14ఏళ్ల పాలనకు ప్రజలు తెరదించారు. సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. 650 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్ 410కిపైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 326. విజయం ఖాయం కావడంతో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్3ని మర్యాదపూర్వకంగా కీర్ స్టార్మర్ కలిసారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు చార్లెస్ ఆయనను ఆహ్వానించారు. ఇక సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్‌లు 120 సీట్ల దగ్గరే ఆగిపోయారు. రిషిసునాక్ ప్రధాని అధికార నివాసం ఎదుట మీడియాతో చివరి ప్రసంగం చేసి రాజును కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ దంపతులు అధికార నివాసం 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఫొటోలకు ఫొజులిచ్చారు. మరోవైపు గురువారం నాడు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐలాండ్‌లలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సాగింది. 67శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డ ఒపినియన్ పోల్స్‌లోనూ లేబర్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని స్పష్టం చేశాయి.