Monday, December 23, 2024

ప్రిన్స్ ఫిలిప్స్ స్మారక కార్యక్రమానికి బ్రిటన్ రాణి ఎలిజబెత్ హాజరు

- Advertisement -
- Advertisement -

Britain's Queen Elizabeth attends Prince Philip's memorial service

 

లండన్ : దివంగత భర్త ప్రిన్స్ ఫిలిప్స్ స్మారక కార్యక్రమానికి బ్రిటన్ రాణి ఎలిజబెత్ మంగళవారం హాజరయ్యారు. గత నెల కొవిడ్ నుంచి కోలుకున్న 95 ఏళ్ల రాణి తన విండ్సర్ రాజప్రాసాదానికే పరిమితమై విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఆమె ప్రజల ముందుకు రావడం లేదు. మంగళవారం ఎలిజబెత్ తన సీనియర్ రాజప్రతినిధులతో కలిసి దివంగత భర్త పిలిప్స్ స్మారక కార్యక్రమంలో దాదాపు 45 నిమిషాలు గడిపారు. వృద్ధాప్య రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్న ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News