Saturday, November 23, 2024

మొక్కలు నాటి వాతావరణ పరిరక్షణకు పాటుపడాలి: ఫ్లెమింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూమి పచ్చగా మారాలంటే ఇంకా మొక్కలు నాటాలని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మాజీ యుఎస్ సిజి అధికారి కరహెరైన్ హడ్డ, ఎంఎయుడి సెక్రటరీ అరవింద్ కుమార్ సవాలు విసరడంతో ఫ్లెమింగ్ మొక్కలు నాటారు. అనంతరం నిర్మల్ కలెక్టర్ ముషార్రఫ్ అలీ ఫారూక్, ఎడిజిపి స్వాతి లక్రా, ఆఫ్ఘానిస్థాన్ సిజి మహ్మాద్ సలేమాన్ కాకర్ కు మొక్కలు నాటాలని సవాలు విసిరారు. ఈ సందర్భంగా ఫ్లెమింగ్ మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అందరూ పాల్గొన్ని మొక్కలు నాటి రికార్డు సృష్టించాలని కోరారు. మొక్కలు నాటి వాతావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. సిఒపి-26 సదస్సు బ్రిటన్ లో జరుగుతుందని, వాతావరణంలో మార్పుల గురించి ప్రపంచ దేశాలు అతి త్వరలో  సిఒపిలో సమావేశమవుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News