న్యూఢిల్లీ: దేశంలో పిల్లలు పెద్దలు అంతా ఇష్టపడి తినే పలురకాల బిస్కెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కంపెనీ బ్రిటానియా తమ తయారీ అయిన బిస్కెట్లు, కుక్కీల ధరలను ఇప్పుడు ఏడు శాతం పెంచనుంది. కంపెనీ ధరల పెంపు చివరికి ఇవి వినియోగదారుడికి చేరేలోపు విపరీతస్థాయికి చేరుకుంటుంది. డిసెంబర్ నుంచి తమ నికర ఆదాయం 19 శాతం వరకూ తగ్గిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ తెలిపారు. ఇంతకు ముందు కొవిడ్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల యుద్ధంతో ఇంతకు ముందెన్నడు లేని స్థాయిలో తమకు ముడిసరుకుల సరఫరా తగ్గిందని, దీనితోనే తమ ఉత్పత్తుల రేట్లను పెంచాల్సి వచ్చిందని బెర్రీ తెలిపారు. 130 సంవత్సరాల చరిత్ర గల బ్రిటానియా రెండేళ్లుగా తీవ్ర సంక్షోభం చవిచూస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి బ్రిటానియా ధరల పట్టిక ప్రకారం మద్రాసు బట్టర్ బిస్కట్ల ధరలు 250 గ్రాములు రూ 90గా ఉంది. గుడ్ డే బట్టర్ బిస్కట్ ప్యాకెటు రూ.20గా ఉంది. అండర్సన్ డానిష్ బట్టర్ కూకీలు రూ.175గా ఉంది. ఈ ధరలు ఇకపై మరింతగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం ఇతర కారణాలతో దాదాపు 3 శాతం పెంపుదలకు ముందు కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంతో ఈ రేటు 9శాతం వరకూ పెరుగుతుంది. ఇతర ప్రముఖ కంపెనీలు కూడా ధరలు పెంచడం లేదా పరిణామం తగ్గించి ఇప్పటి ధరలకు అమ్మడం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది.
Britannia Products price to increase up to 7 percent