Monday, December 23, 2024

యాదాద్రీశుడి సేవలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:తెలంగాణ ప్రసి ద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహసామి వారిని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారిత్ వేన్ ఒయిన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనార్ధం కుటుంబ సమేతంగా యాదాద్రి చేరుకున్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌కు సా ంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

స్వయంభూ శ్రీపంచ నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వాదం చేశారు. అధికారులు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌కు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణాన్ని, విశిష్టతను ఆయనకు ఆలయ అధికారులు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News