Saturday, January 11, 2025

నిరంజన్ రెడ్డితో బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం వర్థిల్లుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం స్వరూపం మారిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు నూతనంగా విధులు స్వీకరించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ గెరత్ విన్ ఓవెన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతానికి ఖర్చు చేశామని, రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సాగునీటి సదుపాయంతో రైతులు వ్యవసాయం పట్ల మక్కువ చూపుతున్నారని కొనియాడారు.

గత ఎనిమిదేళ్లలో నూతనంగా 80 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయని, దేశంలో అత్యధిక పంటలు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయాలు తెలుసుకుని  బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, ఎగుమతులు, దిగుమతులపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో బ్రిటీష్ డిప్యూటీ కమీషన్ రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం అధికారి ప్రణీత్ వర్మ, వారితో పాటు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News