ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ విదేశాంగ శాఖ వీసా పొడిగింపునకు నిరాకరించింది. పాకిస్తాన్‌లో రెండు అవినీతి కేసులలో దోషిగా తేలిన 71 సంవత్సరాల నవాజ్ షరీఫ్‌కు వైద్య చికిత్సల నిమిత్తం నాలుగు వారాలపాటు విదేశాలకు వెళ్లడానికి లాహోర్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో 2019లో ఆయన లండన్‌కు వచ్చారు. అప్పటి నుంచి బ్రిటన్ వీసాపై ఆయన ఇక్కడ నివసిస్తున్నారు. అయితే..తన వీసా గడువును మరోసారి పొడిగించాలని షరీఫ్ చేసుకున్న దరఖాస్తును బ్రిటన్ విదేశాంగ శాఖ తిరస్కరించినట్లు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ప్రతినిధి మరియుం ఔరంగజేబ్ తెలియచేసినట్లు డాన్ వార్తాపత్రిక వెల్లడించింది. కాగా..విదేశాంగ శాఖ నిర్ణయంపై షరీఫ్ ఇమిగ్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేయనున్నారని, అంతవరకు ఆయన లండన్‌లోనే కొనసాగవచ్చని ఔరంగజేబ్‌ని ఉటంకిస్తూ డాన్ తెలిపింది. ఇదే విషయాన్ని నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ ధ్రువీకరించినట్లు పత్రిక తెలిపింది. లండన్‌లో ఒకసారి ఇచ్చిన వీసాపై ఏ విదేశీ పౌరుడు ఆరునెలలకు మించి ఉండరాదు. ఇప్పటివరకు నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపుపై అక్కడే కొనసాగుతున్నారు.
నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపునకు బ్రిటన్ నిరాకరణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -