Thursday, January 23, 2025

బ్రిటిష్ ఎంపి బారీ గార్డినెర్, దివంగత డైరెక్టర్ పీటర్ బ్రూక్‌లకు పద్శశ్రీ అవార్డులు

- Advertisement -
- Advertisement -

లండన్ : బ్రిటిష్ ఎంపి బారీ గార్డినెర్, దివంగత బ్రిటిష్ థియేటర్ డైరెక్టర్ పీటర్ బ్రూక్‌లు 2020, 2021 నాటి పద్శశ్రీ అవార్డులను ఇప్పుడు అందుకున్నారు. లండన్ లోని ఇండియా హౌస్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను వారు గ్రహించారు. భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు బహూకరించవలసి ఉన్నా కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా వీరికి అవార్డుల బహూకరణ జరగలేదు. ప్రజా వ్యవహారాలకు సంబంధించి విశిష్ట సేవ చేసిన ఎంపి గార్డినెర్‌కు, మహాభారతం ఇతిహాసాన్ని స్వీకరించి విశేషంగా ప్రదర్శనలు ఇచ్చిన దివంగత డైరెక్టర్ పీటర్ బ్రూక్‌కు ఈ అవార్డులు లభించాయి.

భారత్‌కు విశిష్టమైన స్నేహితులైన వీరిరువురికి సుదీర్ఘకాలం సేవ చేసినందుకు, భారత్, బ్రిటన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించినందుకు మనం పద్మశ్రీ అవార్డులతో గౌరవించుకుంటున్నామని లండన్ లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. 202021లో కరోనా సమయం నాటి ఈ అవార్డులు అందుకోడానికి చాలా మంది గ్రహీతలు భారత్‌కు లాక్‌డౌన్ కారణంగా రాలేక పోయారని, ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరగవలసిందని, అయినా ఈ సాధారణ సమావేశంలోవీరిని గౌరవించుకునే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. 66 ఏళ్ల ఎంపి గార్డినెర్ లేబర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఎఫ్‌ఐఎన్)గ్రూప్‌ను స్థాపించి గత కొన్నేళ్లుగా దానికి అధ్యక్షత వహిస్తున్నారు.

భారత్‌తో తనకున్న గాఢ అనుబంధాన్ని వివరించారు. దివంగత డైరెక్టర్ పీటర్ బ్రూక్ తరఫున ఆయన కుమారుడు సైమన్ బ్రూక్ , ఇండియన్ సమ్మర్ వంటి చిత్రాల దర్శకుడు తన తండ్రి తరఫున ఈ అవార్డు అందుకోడానికి ప్యారిస్ నుంచి లండన్‌కు వచ్చారు. తన తండ్రికి, భారత్‌కు ఉన్న అనుబంధాన్ని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News