Monday, December 23, 2024

విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

- Advertisement -
- Advertisement -

British Prime Minister Boris Johnson is facing a test of faith

లండన్ : పార్టీగేట్ కుంభకోణంలో ఇరుక్కున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం సొంత పార్టీ ( కన్సర్వేటివ్ పార్టీ ) సభ్యుల నుంచే విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ విషయాన్ని 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీ చట్టసభ్యులకు వెల్లడించారు. ఈ 1922 కమిటీ దిగువ సభలో కన్సర్వేటివ్ పార్టీకి చెందినది. ఈ తీర్మానాన్ని కోరేందుకు పార్లమెంటరీ పార్టీకి విధించిన 15 శాతం పరిమితి దాటిందని గ్రాహమ్ వెల్లడించారు. నిబంధనల మేరకు ఈ రోజు ( జూన్ 6 ) తీర్మాన ప్రక్రియను నిర్వహించనున్నామని తెలిపారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తరువాత ఫలితంపై ప్రకటన ఉంటుందన్నారు. కరోనా ప్రళయంగా వ్యాపిస్తున్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు చేసుకోవడం ప్రధాని జాన్సన్‌కు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. పార్టీ గేట్ కుంభకోణంగా పిలిచే ఈ విందుపై ఏర్పాటైన న్యూ గ్రే కమిషన్, బోరిస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్ వేదికగా బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పినా, విమర్శలు తగ్గలేదు. సొంత పార్టీకి చెందిన 30 మంది సభ్యులు ప్రధాని దిగిపోవాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News