Monday, December 23, 2024

రూ 1.39 లక్షల కోట్లతో గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని 6.4 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవల అనుసంధానానికి కేంద్రం రూ 1.39 లక్షల కోట్ల వ్యయ అంచనాల పథకానికి ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. చిట్టచివరి ప్రాంతానికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణకు రూపొందించిన భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కేటాయింపులు జరిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌నెట్ పరిధిలో ఇప్పటికీ దేశవ్యాప్తంగా 1.94 లక్షల గ్రామాలకు ఈ సేవలు అందిస్తున్నారు.

మిగిలిన వాటికి అనుసంధానం వచ్చే రెండున్నర ఏళ్లల్లో పూర్తవుతుంది. దేశంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ అనుసందానం జరుగుతుంది. దీనితో ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యానికి మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విస్తృత అనుసంధాన కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ అనుబంధమైన భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బిబిఎన్‌ఎల్) విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రిన్యూర్ (విఎల్‌ఇ) భాగస్వామ్యంతో చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News