Friday, November 22, 2024

మిర్చి రైతులకు వ్యాపారి టోకరా

- Advertisement -
- Advertisement -

డబ్బులు కోసం మూడేళ్ళుగా దళారీ చుట్టూ
తిరుగుతున్న మహిళ రైతులు
తాజాగా పోలీసులను ఆశ్రయించిన
బాధిత మహిళలు

Brokers fraud to mirchi farmers in khammam

మన తెలంగాణ/చండ్రుగొండ : ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలోని మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన బాణోత్ బాలు అనే వ్యాపారి మిర్చి రైతులకు టోకరా పెట్టాడు. మూడేళ్ళుగా దళారి చుట్టు డబ్బుల కోసం తిరుగుతున్న మహిళ రైతులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. వివరాల ప్రకారం… మంగయ్యబంజర్ గ్రామానికి చేందిన మహిళరైతులు మాళొత్ మినా,భూక్యా అంకా,భూక్యా బారతి,ఇస్లావత్ లాలి,భూక్యా శాంతి,భూక్యా మంగి,మాళోత్ చంద్ర,లక్ష్మి,బాణోత్ మంగి అనే మహిళ రైతులు మూడేళ్ళ క్రితం అదే గ్రామానికి చేందినబాలు అనే వ్యాపారికి 7.5 లక్షల విలువ చేసే మిర్చి విక్రయించారు.15 రోజుల వాయిదాపై మిర్చి కోనుగొలు చేసిన బాలు డబ్బులు ఇవ్వకుండా మూడేళ్ళుగా తిప్పుకుంటున్నాడని మహిళ రైతులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం రాత్రి జూలూరుపాడు సీఐ నాగరాజు,ఎస్సై రాజేష్‌కుమార్‌లను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో మంగళవారం ఉదయం గ్రామానికి విచారణ నిమిత్తం పోలీసులు వెళ్ళారు.బాలు ఇంట్లో లేకపోవాడంతో అతడి కుమారుడు సాయిరాంను పోలీసులు స్టేషన్‌కు రావాల్సిందిగా చెప్పి వచ్చారు.ఈ క్రమంలో మిర్చి వ్యాపారి బాలు భర్య సరోజ పురుగులు మందు త్రాగి ఆత్మహత్యయాత్ననికి పాల్పడింది.వైద్యచికిత్స నిమ్మిత్తం ఆమెను గ్రామస్తులు కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరిలించారు. ఈ కథనం పై పోలీసులను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టకి రాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News