Tuesday, December 24, 2024

ఆసియా జిమ్నాస్టిక్స్‌లో ప్రణతికి కాంస్యం

- Advertisement -
- Advertisement -

Bronze for Pranati in Asian Gymnastics

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ఆసియా అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రణతి నాయక్ కాంస్య పతకం సాధించింది. ఖతర్ రాజధాని దోహా వేదికగా ఈ పోటీలు జరుగుతున్నాయి. కాగా ఈ పోటీల్లో భారత జిమ్నాస్ట్ ప్రణతి అసాధారణ ప్రతిభను కనబరిచింది. 13.367 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. 2019లో కూడా ప్రణతి ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే ప్రపంచ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్ పోటీలకు ప్రణతి అర్హత సాధించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News